నరసరావుపేట 'స్వర్గపురి'లో కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు

  • తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన కోడెల
  • హైదరాబాద్ నుంచి గుంటూరుకు భౌతికకాయం తరలింపు
  • గుంటూరు నుంచి సత్తెనపల్లి మీదుగా నరసరావుపేట చేరుకున్న అంతిమయాత్ర
టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఇవాళ నరసరావుపేటలోని స్వర్గపురి శ్మశాన వాటికలో జరగనున్నాయి. కోడెల సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారు. అక్కడి నుంచి సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు అంతిమయాత్ర నిర్వహించారు. మరికాసేపట్లో కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కోట సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది.
Go Back to Shorts
Kodela
Narasaraopet
Andhra Pradesh
Telugudesam

More Telugu News